వచ్చే ఎన్నికలలో విజయం మనదే
గులాబీ సైనికులఅంతా ఒకే కుటుంబం…
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది…
తెలంగాణ అభివృద్ధి సంక్షేమం కు అడ్డుపడుతున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వైఖరిని తిప్పికొడదాం…
బీఆర్ఎస్ పినపాక నియోజకవర్గం ప్లీనరీ సమావేశంలో తీర్మానాలు ప్రవేశపెట్టిన… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మన్యం న్యూస్ మణుగూరు టౌన్… ఎవరండీ ప్రజలు బాలు పలికిన ప్రజల వద్ద నక్క వినయాలు ప్రదర్శించిన లేనిపోని హామీలను గుప్పించిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ ప్రభుత్వ విప్ పిరపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పార్టీ అధినేత సీఎం కేసీఆర్ , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి శ్రీ కేటీఆర్ పిలుపుమేరకు బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పినపాక నియోజకవర్గ పార్టీ ప్రతినిధుల ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ,మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తొలిత గులాబీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అలాగే సభలో అమరవీరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు…ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే రేగా మాట్లాడుతూ తెలంగాణలో పటిష్టమైన నాయకత్వాన్ని ప్రజలు ఆశయ సాధన కోసం పనిచేసే పార్టీని మాత్రమే ప్రజలు కోరుకుంటున్నారని, ఈ అర్హతలు బి ఆర్ ఎస్ కు తప్ప ఏ పార్టీకి లేవని పేర్కొన్నారు, ఆది నుంచి నేటి వరకు క్రమశిక్షణ గల పార్టీ అన్నారు. రాజకీయాలు కాదు అభివృద్ధి తమకు ముఖ్యమైన కోణాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్తున్నారని, అందుకే అనేక రంగాలలో నిర్దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచింది అన్నారు, బిజెపి పాలిత రాష్ట్రాలలో లేని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన ఘనత పార్టీకే దక్కుతున్నదని కొనియాడారు, కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసినందుకు బిజెపిని నిలదీయాలి అన్నారు, దేశంలో మత చిచ్చు పెట్టి ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే బిజెపి ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దింపాలి అన్నారు, నియోజకవర్గాన్ని వందలాది కోట్ల రూపాయలు నిధులతో అభివృద్ధి చేస్తున్నామన్నారు, నాయకులు కార్యకర్తలు ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు ఇంటింటా సంక్షేమ పథకాలను వివరించాల్సిన బాధ్యత ఉన్నదని సూచించారు… అనంతరం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో అవుతున్నాయి అన్నారు. 24 గంటలు ఉచిత కరెంటు రైతు బంధు రైతు బీమా, కాలేశ్వరం ప్రాజెక్టు లు, వృద్ధులు వితంతువులు బీడీ కార్మికులు బోధ కార్మికులకు వంటి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు, అదేవిధంగా గతంలో తాను పనిచేసినప్పుడు పినపాక నియోజకవర్గంలో కోట్ల రూపాయలు మంజూరు చేసి రోడ్లు రహదారులను చాలా అభివృద్ధి చేశానని ఆయన గుర్తు చేశారు, ఏజెన్సీ ప్రాంతం వెనుకబడినప్పటికీ అన్ని రంగాలలో తన వంతు కృషిగా నిధులు మంజూరు చేశానని వారు తెలిపారు, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈ తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించాలని వారు, వచ్చే ఎన్నికలలో పార్టీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.