ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి ..
అన్నదమ్ముల పని చేసాం
ప్రజల మనిషి వనమాకు పట్టం కట్టండి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గంలో బిఆర్ఎస్ జండా ఎగరవేయడం ఖాయం
కొత్తగూడెంలో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి తుమ్మల… ఎమ్మెల్యే వనమా
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ప్రజల మనిషిగా తాము ఎన్నో పనులు చేశామని రాజకీయాల్లో పార్టీలు వేరైనా ప్రజల సంక్షేమం కోసం అనునిత్యం కష్టపడుతూ అన్నదమ్ముల పనిచేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి తాము ఎంతో కృషి చేశావని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్లో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలోఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంతరించుకుందని ఏజెన్సీ ప్రాంతాలు అధికంగా ఉండడంతో పాటు ప్రజల మౌలిక సదుపాయాలతో పాటు విద్య వైద్యం ఉపాధి రంగాల్లో ప్రజలకు సముచితమైన న్యాయాన్ని కలిగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక పథకాలతో పాటు కార్యచరణ ప్రణాళికలు ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయి అన్నారు.. ప్రధానంగా వ్యవసాయంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్ష పదివేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సీతారామ ప్రాజెక్ట్ సిద్ధమైందని ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలంగా నిలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రత్యేకమైన కృషి అందుకు నిదర్శనం అన్నారు. టిఆర్ఎస్కు అసలు ఓటు ఎందుకు వేయాలని మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ను తిరిగి అధికారులకు తీసుకురావాలని ప్రజలు ఆలోచించడంలో తప్పు లేదని స్పష్టం చేశారు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రైతుబంధు రైతు బీమా ఆసరా పింఛన్లు వంటి అనేక పథకాలను ప్రజల్లోకి తీసుకువచ్చి అట్టడుగు వర్గాల స్థాయి వరకు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో శ్రమించి 50 ఏళ్లు రాజకీయ చరిత్రలో ప్రజల మనిషిగా పేరుపొందిన వనవా వెంకటేశ్వరరావును తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే కొత్తగూడా నియోజకవర్గ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కడం లో ఆశ్చర్యం లేదన్నారు మృదుస్వవి మనసున్న మహారాజుగా పేరుగాంచిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రజలకు ఎలాంటి హామీ చేయకుండా కొత్తగూడెం నియోజకవర్గంలోని ప్రజలను సొంత బిడ్డలుగా చూసుకుంటూ తన రాజకీయ జీవితాన్ని ప్రజలకి అంకితం చేశారని అలాంటి మనసున్న మనిషిని మరోసారి గెలిపించుకుంటే భావితరాల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతారని ఆకాంక్షించారు. పార్టీలకు అతీతంగా పనిచేసిన ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వర్రావు గతంలో వేరే పార్టీలో ఉన్నప్పటికీ తాను తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్న సమయంలోనే కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధి కోసం అనేక పర్యాయలుగా కోట్ల రూపాయలను మంజూరు చేసి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు అందించామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనలు మరోసారి ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావుకు చక్కటి అవకాశం దక్కుతుందని స్పష్టం చేశారు. బీరు బాటిలకు మటన్ ముక్కలను ప్రజలు మరోసారి మోసం చేసేందుకు మాయగాళ్లు వస్తున్నారని అలాంటి వారి మాటలను నమ్మకుండా నిస్వార్థ సేవకుడైన వనమా వెంకటేశ్వరరావు వైపు ప్రజలు మద్దతు పలకాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కోసం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా పిలవగానే కొత్తగూడెం నియోజకవర్గంలో హాజరైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు తనపై నమ్మకం ఉంచి ప్రజల తరఫున మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి వనమా వెంకటేశ్వరరావును ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు చుంచుపల్లి ఎంపీపీ బాదావత్ శాంతి నాయకులు కాసుల వెంకట్ ఎంఏ రజాక్ అన్వర్ పాషా, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ముఖ్య రాంబాబు, మండే వీర హనుమంతరావు, గిట్ల పరంజ్యోతి రావు జిల్లా అధికార ప్రతినిధి జేవిఎస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు