మన్యం న్యూస్ దుమ్మగూడెం ఏప్రిల్ 25::
మండల పరిధిలోని ములకపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ, సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పుల్లారెడ్డి పాల్గొని మాట్లాడుతూ జాతీయ కీటక జనత వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏడాది ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవం జరుగుతుందని, గ్రామాల్లో ఎవరికైనా చలి, జ్వరము, తలపోటు, ఒంటినొప్పులు ఉంటే మలేరియా వ్యాధిగా గుర్తించవచ్చునని అన్నారు. వ్యాధి నివారణకు దోమతెరలు వాడాలని సూచించారు. ఇంటి పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన గ్రామ గ్రామాన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ యూ ఓ హనుమంత్ హెచ్ ఎస్ సాగర్ హెల్త్ అసిస్టెంట్ ధర్మయ్య గంగాధర్ నరసింహారావు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.