UPDATES  

 వాడవాడనా రెపరెపలాడిన గులాబీ జెండా  – గ్రామాల్లో జెండాను ఆవిష్కరించిన గ్రామ కమిటీ అధ్యక్షులు

వాడవాడనా రెపరెపలాడిన గులాబీ జెండా
– గ్రామాల్లో జెండాను ఆవిష్కరించిన గ్రామ కమిటీ అధ్యక్షులు
– పార్టీ పుట్టినరోజును పండుగలా జరుపుకున్న కార్యకర్తలు

మన్యం న్యూస్, బూర్గంపాడు :

భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బూర్గంపాడు మండలంలోని సుమారు అన్ని గ్రామాల్లో గులాబీ జెండాలు రెపరెపలాడాయి. మంగళవారం భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బూర్గంపాడు మండల కేంద్రంలో ఆపార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు సోహెల్ పాషా బిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసి కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో గ్రామ కమిటి అధ్యక్షులు పోతిరెడ్డి గోవింద రెడ్డి గులాబీ జెండాను ఆవిష్కరించారు. సారపాక ఐటిసి కర్మాగారం ఎదుట ఐటీసీ బి ఆర్ టి యు అధ్యక్షులు సానికొమ్ము శంకర్ రెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. ఉప్పుసాక పంచాయతీలో పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు సురేష్ గులాబి జెండాను ఆవిష్కరించారు. పినపాక పట్టి నగర్ గ్రామంలో పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కొట్టే నాగేశ్వరరావు టిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. మోతే గ్రామపంచాయతీలో పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకట నరసింహారావు గులాబీ జెండాను ఆవిష్కరించారు. మొరంపల్లి బంజర పంచాయతీలో పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కైపు ఖగేందర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మేడగం శ్రీనివాసరెడ్డి జెండాను ఆవిష్కరించి పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకున్నారు. తాళ్లగొమ్మూరు పంచాయతీలో పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు దాసరి విజయ్ కుమార్ గులాబీ జెండాను ఎగురవేశారు. అదేవిధంగా మండల పరిధిలోని కోయగూడెం, కృష్ణ సాగర్ తదితర గ్రామపంచాయతీలో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు కోలాహలంగా జరిగాయి. పల్లె పల్లెనా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా మండల పరిధిలోని నిర్వహించిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, స్థానిక జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, స్థానిక సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు వల్లూరిపల్లి వంశీకృష్ణ, సారపాక పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీనివాస్, పార్టీ నాయకులు గుల్ మహమ్మద్, చల్లకొట్టి పూర్ణ, సోము లక్ష్మీ చైతన్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !