UPDATES  

 విద్యుత్ షాక్ తో మరణించిన లైన్ మెన్ ఉపేందర్ మృతదేహంతో సబ్ స్టేషన్ ఎదుట ఆందోళన*

విద్యుత్ షాక్ తో మరణించిన లైన్ మెన్ ఉపేందర్ మృతదేహంతో సబ్ స్టేషన్ ఎదుట ఆందోళన*
మృతుని కుటుంబానికి యాభై లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి:సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ
మన్యంన్యూస్, గార్ల..విధి నిర్వహణలో భాగంగా ప్రమాదవశాత్తు మృతి చెందిన లైన్ మెన్ ఉపేందర్ కుటుంబానికి యాబై లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గార్ల మండల పరిధిలోని పినిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన వాంకుడోత్ ఉపేందర్ గత పదిహేను సవత్సరాల నుండి గార్ల సబ్ స్టేషన్ పరిధిలో హెల్పర్ గా విధులు నిర్వహిస్తూ ఎన్నో గ్రామాలకు విద్యుత్ సేవలు అందిస్తున్నరని తెలిపారు. ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా తెగిపడ్డ లైనులను మరమ్మత్తులు చేస్తున్న తరుణంలో కరెంటు షాక్ కొట్టి మరణించడం జరిగిందని, ఎలాంటి రక్షణ పరికరాలు ఇవ్వకుండా వారిని విధులు నిర్వర్తించేలా చేసి వారి ప్రాణాలు పోవడానికి గల కారణం అయిన అధికారులను సస్పెండ్ చేయాలని అలాగే మరణించిన ఉపేందర్ కుటుంబానికి యాభైలక్షల ఎక్స్ గ్రేషియా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని సిపిఐ(ఎంఎల్) న్యూడెమక్రసీ గోపాలపురం పినిరెడ్డిగూడెం గ్రామ కమిటీలు డిమాండ్ చేశారు.నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉపేందర్ మృతికి కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలని కోరుతూ గార్ల సబ్ స్టేషన్ ఎదుట సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కుటుంబసభ్యులు ధర్నా నిర్వహించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !