మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 25::
సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కొరకు భూసేకరణ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు పనులు నిలిపివేయాలని దుమ్ముగూడెం చర్ల భూనిర్వశితుల సంఘం అధ్యక్షుడు కొమరం దామోదర్ రావు తెలిపారు. వర్షాకాలంలో వచ్చే అదనపు నీటిని నావిగేషన్ కాలువ ద్వారా వీటిని మళ్ళించడానికి భూసేకరణ కోసం మంగళవారం సీతానగరం గ్రామానికి జాయింట్ కలెక్టర్ వస్తున్నారని సమాచారంతో రైతులు తమ సమస్యలను తెలపడం కోసం ఎదురు చూడగా జాయింట్ కలెక్టర్ రాకపోవడంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆదినారాయణ లక్ష్మయ్యకు రైతులు పలు సమస్యలతో వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా దామోదర్ రావు మాట్లాడుతూ రెండో భూసేకరణ వలన రైతులు పూర్తిగా భూమిని .కోల్పోయే అవకాశం ఉందని కావున భూములు కోల్పోతున్న రైతులు అందరికీ రూ. 30 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు కరకట్ట నిర్మాణం వల్ల వర్షాకాలంలో పైనుంచి వచ్చే వరదతో సీతానగరం, నడిగడ్డ, ఎల్ ఎన్ రావు పేట పిరాయిగూడెం, ముసలిమడుగు, పెద్దబండిరేవు, పర్ణశాల గ్రామాలు వర్షాకాలంలో పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉన్నందున ఎత్తైన ప్రదేశంలో ఇంటి స్థలాలు వారికి కేటాయించాలని అలానే ప్రభుత్వం హామీ ఇచ్చేంత వరకు భూసేకరణ పనులు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు తెల్లం హరికృష్ణ, సాగి రామచంద్రరాజు, కొమరం బొజ్జి, కామరాజు, రమేష్, లక్ష్మిపతిరావు, వెంకటరమణ, లక్ష్మి, కుమారి, తదితరులు పాల్గొన్నారు.