UPDATES  

 గ్రామాల్లో బిఆర్ఎస్ జెండా పండుగ…

 

మన్యం న్యూస్ చండ్రుగొండ, ఏప్రిల్ 25: మండల వ్యాప్తంగా గ్రామాల్లో బిఆర్ఎస్ జెండాపండుగను ఘనంగా నిర్వహించారు. మంగళవారం 14 పంచాయతీల్లో బిఆర్ఎస్ గ్రామశాఖల ఆద్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. మండల కమిటీ ఆద్వర్యంలో చండ్రుగొండ ప్రధాన సెంటర్లోని తెలంగాణ దిమ్మె వద్ద . పార్టీ జెండాను మండల అధ్యక్షులు దారా వెంకటేశ్వరరావు(దారా బాబు) ఆవిష్కరించారు. అశ్వరావుపేటలో జరిగే బిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సభకు పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వాహనాల్లో తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అద్యక్ష, ప్రధాన కార్యదర్శులు దారా బాబు. ఉప్పతల ఏడుకొండలు, సీనియర్ నాయకులు నల్లమోతు వెంకటనారాయణ, సయ్యద్ రసూల్, భూపతి రమేష్, మేడా మెహన్ రావు , గాదె శివప్రసాద్, చీదెళ్ల పవనకుమార్, గాదె లింగయ్య, భూపతి శ్రీనివాసరావు, మద్దిరాల చిన్నపిచ్చయ్య, సత్తి నాగేశ్వరరావు, ఉన్నం నాగరాజు, సూర వెంకటేశ్వరరావు, వంకాయలపాటి బాబురావు,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !