UPDATES  

 హిందుత్వ ప్రాసిజానికి వ్యతిరేకంగా పరిశ్రమల రక్షణ కోసం కార్మికవర్గం పోరాడాలి.

హిందుత్వ ప్రాసిజానికి వ్యతిరేకంగా పరిశ్రమల రక్షణ కోసం కార్మికవర్గం పోరాడాలి.
137వ మేడే పోస్టర్ ఆవిష్కరణలో సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి కొండపల్లి శీను

మన్యం న్యూస్,ఇల్లందు టౌన్… మోడీ ప్రభుత్వం కార్మికవర్గంలో మతం పేరున రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంటున్నదని కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తూ కార్మిక వ్యతిరేక, ప్రజావ్యతిరేక, విధానాలను అమలు చేస్తున్నదని కేంద్రప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం ఉద్యమించాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.ప్రపంచ కార్మిక దినోత్సవంలో భాగంగా 137వ మేడే సందర్భంగా ఐఎఫ్టియు జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు గోడపత్రిక ఆవిష్కరణ ఇల్లెందు సీఎస్పీ వద్ద కార్మికుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులను తినే తిండి మీద, కట్టె బట్ట మీద, ప్రజల అలవాట్ల మీద ఆంక్షలు పెడుతున్నారని..మూడత్వన్ని ప్రజలలో ప్రచారం చేస్తూ సైన్స్ ను సమాధి చేస్తుందని కేంద్రప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మానవ పరిణామక్రమాన్ని శాస్త్రీయంగా విశ్లేషించే డార్విన్ సిద్ధాంతాన్ని పాఠ్యాంశం నుంచి తొలగించడం ఆర్ఎస్ఎస్ మోడి విధానాలకు నిదర్శనం అన్నారు. వందల సంవత్సరాలుగా కార్మికవర్గం పోరాడి సాధించిన 29 కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల ప్రయోజనం కోసం రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1886 లోనే ప్రపంచ వ్యాప్తంగా కార్మికవర్గం ఎనిమిది గంటల పనిని సాధించిందని 137 ఏండ్ల తరువాత భాజపా ప్రభుత్వం, మోడి ఎనిమిది గంటల పనిని రద్దు చేశాడని ఇందువల్ల కార్పొరేట్ సంస్థలు 12 నుండి 16 గంటల పనిని చేయిస్తూ కార్మిక శ్రమను దోచుకుంటున్నారని ఆరోపించారు.
దేశంలో ప్రజల సొమ్ముతో స్థాపించబడిన సంస్థలైన రైల్వే, బొగ్గు, ఎల్ఐసి, ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్, డిఫెన్స్, ఖనిజ సంపదలు వనరులన్నిoటిని అధాని, అంబానీ లాంటి ప్రవేట్ శక్తులకు కారుచౌకగా అమ్మి వేస్తున్నారని విమర్శించారు. లాభాలతో నడుస్తున్న సింగరేణి బొగ్గుగనులు, స్టీల్ ప్లాంట్ లను ప్రైవేటు శక్తులకు అమ్మి వేస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలని ఐఎఫ్టియు జాతీయ కమిటీ 137 మేడే సందర్భంగా పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేందర్, సాయి, లక్ష్మణ్, ఇంతియాజ్, శ్రీనివాస్, రవి, రమేష్, శ్రావన్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !