మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 25::
దుమ్ముగూడెం మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించి జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం మండల కేంద్రంలోని లక్ష్మీనగరం పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమానికి ముందు ఆవిర్భవ దినోత్సవ వేడుక సందర్భంగా బిఆర్ ఎస్ పార్టీ శ్రేణులు పర్ణశాల గ్రామం నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీ మోటార్ బైక్ ర్యాలీని నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు చేసిన పోరాటాల ఫలితమే మనం సాధించిన బంగారు తెలంగాణ అని మండల అధ్యక్షులు అన్నారు నేడు ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి దేశవ్యాప్తంగా చేయడానికి రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి పథకాలు మార్గదర్శనం కావాలని తెలిపారు బిజెపి చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలు గమనించి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. అనంతరం భద్రాచలం లో తలపెట్టిన నియోజవర్గ సమావేశానికి మండల అధ్యక్షులు సత్యాలు ఆధ్వర్యంలో భారీ ఎత్తున తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేసు లక్ష్మి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రాముడు, అధికార ప్రతినిధి ఎండి జానీ పాషా, ఉపాధ్యక్షులు వీర్రాజు, సర్పంచులు వెంకటేశ్వర్లు, జ్యోతి, కొండయ్య, చందు, వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ భీమరాజు, పార్టీ నాయకులు శ్రీనివాసరావు, లక్ష్మణ్, మోత్కూరి శ్రీకాంత్, బొల్లి శేఖర్, కెల్లా శేఖర్, జయసింహ తదితరులు పాల్గొన్నారు