UPDATES  

 అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన వరి పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలి – పొదెం వీరయ్య

మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండల పర్యటనలో భాగంగా భద్రాచలం శాసనసభ్యులు  పొదెం వీరయ్య చర్ల మండలంలోని కుదునూరు ఆర్ కొత్తగూడెం పెద్దపల్లి సత్యనారాయణపురం తెగడ గ్రామాలలోని వరి సాగు చేయు రైతులును ఇటీవల అకాల వర్షాల వలన పంట నష్టపోయిన విషయమై స్వయంగా వారి పంట పొలాల్లోకి వెళ్లి వారిని పరామర్శించడం జరిగింది. అకాల వర్షాల వలన పంట నష్టపోయిన రైతుల అందరిని ప్రభుత్వం ఆదుకోవాలని వారి దగ్గర నుండి పూర్తి పంటను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.. స్థానిక మండల తహాసిల్దార్ , వ్యవసాయ శాఖ సిబ్బంది అధికారులతో కలిసి ఈ పర్యటన నిర్వహించడం జరిగింది. సత్యనారాయణపురం పిఎసిఎస్ ఆఫీసులో ప్రస్తుత చర్ల మండల వ్యవసాయ పరిస్థితులపై రివ్యూ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్ , చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి , చర్ల మండలం ఎంపీపీ గీద కోదండరామయ్య, ఎంపీటీసీలు మడకం పద్మజ, ముత్యాల స్వాతి, సర్పంచులు సోడి చలపతి, యలకం నరేంద్ర పిఎసిఎస్ డైరెక్టర్లు భద్రం, ఇందల రమేష్, బుచ్చి బాబు , మేడ్చెర్ల కుమార్ గూడపాటి సతీష్ పుల్లారావు , ఆవుల శ్రీను , సుందరి సురేష్ , సాల్మన్, పండు, బాలుతదితర కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !