రేగన్న సాయం..
జీవితాంతం గుర్తుంచుకుంటాం
రేగాకు కృతజ్ఞతలు తెలిపిన గ్రూప్ – 1 ఔత్సాహికులు
హైదరాబాద్ :
రేగన్న సాయం జీవితాంతం గుర్తుంచుకుంటామని గ్రూపు – 1 కు
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు సాయంతో హాస్టళ్లలో ఉండి ప్రిపేరవుతున్న అభ్యర్థులు తెలిపారు. గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థుల కోసం రేగా విష్ణు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్‌లో ఉచితంగా హాస్టల్ వసతి ఏర్పాటు చేసి సహాయపడుతున్నారు. అలాగే వారికి కావాల్సిన మెటీరియల్‌ను సైతం ఉచితంగా అందిస్తూ తోడ్పాటును అందిస్తున్నారు. హైదరాబాద్ అసెంబ్లీ ప్రాంగణంలో శుక్రవారం రేగాతో కలిసి వీరు తమ సంతోషాన్ని పంచుకున్నారు.