మన్యం న్యూస్ చర్ల :
చర్ల మండలం లోని నాయకుల కాలనీ లోని 10 కుటుంబాలు సి పి ఐ యం.ఎల్ ప్రజాపదం పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకత్వం ఈ కుటుంబాలకు ఎర్ర కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీ మండల కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ పార్టీని పార్టీ నాయకత్వాన్ని నమ్మి నాయకుల కాలనీ లోని ఈ 10 కుటుంబాలు పార్టీలో చేరినందుకు వారికి విప్లవ జేజేలు తెలిపారు. ప్రజా క్షేత్రం లో పార్టీ చేస్తున్న రాజిలేని పోరాటలకు ఆకర్షతులై ఈ కుటుంబాలు పార్టీలోకి వచ్చారని అన్నారు. కచ్చితంగా ఈ కుటుంబాలకు కష్ట నష్టాల్లో పార్టీ, పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. భవిష్యత్ లో ఈ గ్రామంలోని సమస్యలను వెలికి తీసి వాటి పరిస్కారానికి కృషి చేస్తామని అన్నారు. ప్రత్యామ్నాయ విప్లవ రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెలుతున్నామని దానికారణంగానే ప్రజలు పార్టీని అధిక సంఖ్యలో ఆదరిస్తున్నారని అన్నారు. భవిష్యత్ లో ఖచ్చితంగా చర్ల మండల రాజకీయ ముఖచిత్రాన్ని ప్రజాపంథా పార్టీ సమూలంగా మారుస్తుందని అన్నారు.ఈ కార్యక్రమం లో పార్టీ మండల సీనియర్ నాయకులు పాలెం చుక్కయ్య, పార్టీ నాయకులు మునిగల శివ కొక్కెరపాటి రవి నాగేష్,, సత్యవతి, సావిత్రి, మాదూరి, సరస్వతి, శైలజ, సంతోషి, రమేష్,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
