అయ్యా రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో
సహనాన్ని పరీక్షించవద్దు
బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి అన్వర్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ఇంట గెలవలేనమ్మ రచ్చకేడ్చిందట. .. అనే సామెత గుర్తొస్తుంది కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి బీ ఆర్ఎస్ పార్టీపై చేస్తున్న విమర్శలు చూస్తుంటే అంటూ బిఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఎస్కే అన్వర్ పాష శనివారం ఒక ప్రకటనలో ఖండించారు.
శుక్రవారం నల్గొండ ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మీద అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ముఖ్యంగా బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలను,తాగుబోతు సమ్మేళనాలు అని అనడం పూర్తిగా ఖండిస్తున్నమని అన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మా ఆత్మీయ సమ్మేళనంలో అభివృద్ధి గురించి చర్చలు ఉంటాయి కానీ మీరు చేస్తున్న ఈ ప్రచారంలో ఎన్ని సార్లు మీలో మీకు గొడవలు జరిగాయో ప్రజలే బహిర్గతంగా చర్చించుకుంటున్నారని విమర్శించారు .,అసలు మీ పార్టీ పెద్దలది ఒకొక్కలది ఒకొక్క దారి… మీరా మా ఆత్మీయ సమ్మేళనం గురించి మాట్లాడేది అంటూ ప్రశ్నించారు, క్రమశిక్షణకు, సహనానికి మారు పేరు బీఆర్ఎస్ పార్టీ అని పార్టీ పెద్దలు మాకు క్రమశిక్షణ నేర్పారని, ఓపికగా ఉండమన్నారని ఒక్క సారి మా కార్యకర్తలను హు అంటే మీ లాంటి వాళ్ళకి గట్టిగా బుద్ధి చెబుతాం అంటూ హెచ్చరించారు సహనాన్ని పరీక్షించొద్దని త్వరలోనే తెలంగాణలోప్రజలు మీకు బుద్ధి చెప్పుతారని సవాల్ విసిరారు.
