మన్యం న్యూస్ చండ్రుగొండ మే 01:
మండల వ్యాప్తంగా అకాల వర్షానికి తడిసిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని పొంగిలేటి నియోజకవర్గ అభ్యర్థి జారే ఆదినారాయణ డిమాండ్ చేశారు. సోమవారం మండల పరిధిలోని దామరచర్ల గ్రామంలో తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులు గోడు వెళ్ళబోసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…వారం రోజులు క్రితమే సొసైటీ వారు కాటా పెట్టి ఇప్పటివరకు ధాన్యాన్ని స్వాధీనం చేసుకోకపోవడంతో రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం మొత్తం తడిసి పోయాయని అన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వెంట సొసైటీ డైరెక్టర్ పసుపులేటి వెంకటేశ్వర్లు, చాపలమడుగు ప్రసాద్, సంగుడి రాఘవులు, బన్నె నాగరాజు, రైతులు నాయకులు పాల్గొన్నారు.