మన్యం న్యూస్: జూలూరుపాడు, మే 01, మే డే కార్మికుల దినోత్సవం సందర్భంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన, కార్మికుల విగ్రహాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు ఆవిష్కరించారు.
భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎఐటియుసి పతకాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కూనంనేని మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం వారి రక్షణ కోసం నిరంతరం ఏఐటియుసి పోరాటం కొనసాగిస్తుందని, కార్మికులకు ఎల్లప్పుడు సిపిఐ అండగా ఉంటుందని, ఈ దేశంలో 30 కోట్ల మంది కి పైగా కార్మిక రంగంలో సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారని, వారి హక్కుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడంలేదని, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం పోరాడి సాధించుకున్న 44 చట్టాలను నాలుగు కొడు లుగా విభజిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా కార్మికులంతా వ్యతిరేకిస్తూ ఉద్యమాలకు సిద్ధం కావాలని అన్నారు. జూలూరుపాడులో కార్మిక చిహ్నం విగ్రహావిష్కరణ ను ఏర్పాటు చేసిన భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వారిని శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, సిపిఐ వైరా నియోజకవర్గ కార్యదర్శి ఎర్ర బాబు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్, మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు సిలువేరి నరసింహారావు, పూరేటి సత్యనారాయణ, పిన్నుల ఆంజనేయులు, గుడిమెట్ల సీతయ్య, బలుగూరి నరసింహారావు, ఎస్.కె కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.
