మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 01::
ఐకెపి వివో ఎ లా న్యాయమైన డిమాండ్లను సమస్యలను తీర్చాల్సిందేనని సిపిఎం పార్టీ భద్రాచలం కన్వీనర్ మండల కార్యదర్శి కారం పుల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని లక్ష్మీనగరం ఎస్బిఐ బ్యాంకు ముందు సిఐటియు యూనియన్ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మె సోమవారం నాటికి 15 రోజుకు చేరుకుంది. ఈ సమ్మెను మేడే సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి పద్మ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం ములకపాడు నుంచి ఎస్బిఐ బ్యాంకు వరకు ర్యాలీ నిర్వహించారు సమ్మె చేస్తున్నటువంటి వివోఎ లకు సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం, అంగన్వాడి ఆశ వర్కర్లు మిషన్ భగీరథ కార్మికులు గ్రామపంచాయతీ కార్మికులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వివోఏలను గుర్తించాలని వారి శ్రమకు తగ్గ వేతనం అందించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంఘం నాయకులు శ్రీనుబాబు సిఐటియు అధ్యక్షురాలు చిలకమ్మా వివోఎ మండల అధ్యక్షులు జి వెంకటేశ్వర్లు కార్యదర్శి నాగరాజు గుట్టయ్య కృష్ణవేణి మంగ వేణి ఝాన్సీ రాజేశ్వరి కల్లూరి పద్మ తదితరులు పాల్గొన్నారు.