మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 1
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు తెలంగాణ కోల్ భవన్ కాట దగ్గర ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో జడ్పిటిసి పోశం. నరసింహ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ జెండా ను ఆవిష్కరించడం జరిగింది.అనంతరం జెడ్పీటీసీ పోశం. నరసింహరావు మాట్లాడుతూ కార్మికులకు నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల చేస్తున్న కార్యక్రమాలను వివరించడం జరిగింది.కార్మికులకు బిఆర్ఎస్ పార్టీ ఎల్లపుడూ తోడుగా ఉంటుంది తెలియజేస్తూ, కార్మిక సమస్యలకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.కార్మికులకు మే డే శుభాకంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,పినపాక నియోజకవర్గం అసంఘటిత కార్మిక సంఘాల అధ్యక్షులు కత్తి రాము,మణుగూరు టౌన్ అధ్యక్షులు అడపా. అప్పారావు,ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి నవీన్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముద్దంగుల కృష్ణ, కుంటా లక్ష్మణ్,తాతా రమణ, టౌన్ యువజన ప్రధాన కార్యదర్శి గుర్రం సృజన్, ఉల్లోజు బాబీ,షేక్ బాజీ, మహిళా అధ్యక్షురాలు చంద్రకళ,ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు ముస్తఫా,ప్రధాన కార్యదర్శి దొడ్డ మోహన్, ట్రెజరర్ వలీ,బిటిపిఎస్ ఇంచార్జి తాతా ప్రసాద్, కార్మికులు,యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.