మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 1
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండలంలోని రైతులందరు తమ పంట పొలాలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని మణుగూరు పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరావు తెలిపారు. సోమవారం మండల మున్సిపాలిటీ పరిధిలోని కుంకుడు జట్ల గుంపు ప్రాంతాన్ని సందర్శించి వరి కల్లాలను పరిశీలించారు. అనంతరం రైతుల సమస్య లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,గత రాత్రి నుంచి వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంట పొలాలలపై, వరి కల్లలపై,రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.ఒక వైపు పగలు ఎండలు ఉన్న,రాత్రి వేళ వాతావరణం చల్లబడి,వర్షం కురుస్తోందని రైతులకు తెలిపారు.రాష్ట్రంలో వర్ష సూచన ఏర్పడిందని ఈ విషయాన్ని రైతులు గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు.రానున్న 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు తెలిపారు.కావున రైతులు అధైర్య పడకుండా,పంట పొలాలలపై ముందు జాగ్రత్తగా తీసుకోవాలని,వరి కల్లలపై పరదాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా రైతన్నలకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో రైతుబంధు సమితి అధ్యక్షులు రామసాని వెంకటరెడ్డి,సీఈవో జ్ఞాన దాస్,రైతులు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.