UPDATES  

 సిపిఐ,ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా మే డే ఉత్సవాలు

  • సిపిఐ,ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా మే డే ఉత్సవాలు
  • వాడు వాడలో,గ్రామాలలో, బొగ్గు గనులలో ఎగిరిన ఎర్రజెండాలు
  • కార్మికుల హక్కుల సాధనకై ఐక్యంగా ఉద్యమించాలి.
  • -సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.అయోధ్య

మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 1

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ,కార్మికుల ఐక్యంగా ఉద్యమించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. అయోధ్య పిలుపునిచ్చారు. మణుగూరు మండలం పట్టణంలో మే డే 137 వ ఉత్సవాలను సిపిఐ, ఏఐటియుసి ఆధ్వర్యంలో మండలం,పట్టణంలో,గ్రామ గ్రామాన,బొగ్గు గనులలో వాడవాడలా జండాలను ఎగురవేశారు.బోగ్గు ముఠా, గుమస్తాల సంఘం,ఆటో యూనియన్ వద్ద సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. అయోధ్య జెండాలను ఎగరవేసి మాట్లాడారు.ఈ సందర్భంగా బి.అయోధ్య మాట్లాడుతూ, అమెరికా చికాగో నగరంలో 18 గంటల పని విధానాన్ని నిరసిస్తూ,కార్మికులను వెట్టిచాకిరి,బానిసత్వం చేయిస్తూ,ఉదయం నుంచి రాత్రి కర్మాగారాల్లో కార్మికుల ను,వారి శ్రమను దోచుకుంటున్న చికాగో నగరంలో వేలాది మంది కార్మికులు,ఆనాడు ఒకేసారి తిరుగుబాటు చేసిన పోరాటంలో అనేక మంది ప్రాణ త్యాగాలు చేశారని,వారి నెత్తురుతో తడిచిన ఎర్రజెండానే మే డే గా గుర్తించబడిందని అన్నారు.18 గంటల పని విధానాన్ని ఎనిమిది గంటలకు మార్చబడిందని,వీటితో పాటు అనేక కార్మిక హక్కులు ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారని తెలిపారు. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని రుజువు చేశారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నేడు కార్మికులకు పండుగ రోజు అని,మే డే కార్మిక దినంగా గుర్తించబడిందని వారు అన్నారు.కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలను నాలుగు చట్టాలుగా మార్చే ఆలోచన విరమించుకోవాలని,దీనికి కార్మిక రంగం కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మకుమారి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ లక్ష్మీ నారాయణ,సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి,రామ్ గోపాల్,సిపిఐ మణుగూరు మండల పట్టణ కార్యదర్శులు జంగం మోహన్ రావు,దుర్గాల సుధాకర్, ఏఐటీయూసీ మణుగూరు మండల అధ్యక్ష కార్యదర్శులు తోట.రమేష్,అక్కి.నరసింహారావు,ఎంపీటీసీలు కామసూత్ర రామారావు,పాయం.లక్ష్మయ్య, సర్పంచులు బాడిస సతీష్, పాయం కామరాజు,సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి చింతల దశరథం,ఎస్ వి నాయుడు,బొగ్గు ముఠా కార్యదర్శి జక్కుల రాజబాబు, కోటయ్య,లింగస్వామి, గుమస్తా సంఘం అధ్యక్షులు భీమరాజు కృష్ణ,రఘువరన్, నరసింహరావు,మంగి వీరయ్య,ఆటో యూనియన్ కార్యదర్శి వెంకట్ ఉపాధ్యక్షులు బత్తిని శ్రీను, రామకోటి,నాగేశ్వరరావు, కాసరపాదు రమేష్,శ్రీరాములు, చంద్రం,నోముల రవి,వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !