మన్యం న్యూస్ ఏటూరు నాగారం
ములుగు జిల్లా యూత్ , స్పోర్ట్, కల్చర్ ఆక్టివిటీ కార్యక్రమంలో భాగంగా కరాటే అండ్ తైక్వాండో శిక్షణ ఏటూరునాగారం గిరిజన భవన్ లో మే 1 తేది నుంచి 31 వరకు నిర్వహించబడు శిక్షణ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఏటూరునాగారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈసం రామ్మూర్తి శిక్షణ ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కోచ్ ఇర్ప బాలాజీ,హ్యాండ్ బాల్ కోచ్ కుమార్ స్వామి,పెండ్యాల ప్రభాకర్,పూసం లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.అనంతరం కోచ్ ఇర్ప బాలాజీ మాట్లాడుతూ. 10 సంవత్సరముల నుంచి 14 సంవత్సరాల వయస్సు గల బాల బాలికలకు ఉచితం గా తైక్వాండో శిక్షణ నెల రోజు ఇవ్వటం జరుగుతుందన్నారు.శిక్షణ పొందిన ప్రతి విద్యార్థి కి సరిటిఫికెట్ ఇవ్వటం జరుగుతుందని అన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 5వ తేది లోగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోగలరని, ఆసక్తిగల విద్యార్థిని,విద్యార్థులు 8008199773 ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరని అన్నారు.
