ఘనంగా కార్మిక దినోత్సవంమన్యం న్యూస్ గుండాల..న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఘనంగా మండలంలో కార్మిక దినోత్సవం నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు కాచనపల్లి, జగ్గు తండా, కొడవటంచ, చెట్టుపల్లి, వేపల గడ్డ, తదితర గ్రామాల్లో పార్టీ ఆధ్వర్యంలో మేడే వేడుకలను నిర్వహించారు. అనంతరం గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, సర్పంచ్ కోరం సీతారాములు మాట్లాడుతూ శ్రామికుల కర్షకుల దినోత్సవం అయిన మే డే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని వారన్నారు. శ్రమ దోపిడిని పాల్పడుతున్న యాజమాన్యాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉపేందర్ ,నాయకులు యాసారపు వెంకన్న, పుష్ప రాజ్, రమేష్ , గడ్డం నగేష్ , బాల్య కిరణ్, పరిశిక రవి,గడ్డం లాలయ్య, తదితరులు పాల్గొన్నారు .
