మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 01: అశ్వరావుపేట నియోజకవర్గం లో అశ్వరావుపేట, ములకలపల్లి మండలాల్లో సినీ హీరో సుమన్ సోమవారం పర్యటించారు. వ్యక్తిగత పనులు నిమిత్తం వచ్చిన సుమన్ అశ్వరావుపేట మండలం రెడ్డిగూడెం గ్రామంలో ఉన్న సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ములకలపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు, అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి సుమన్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాలలో పలువురు సినీ అభిమానులు, భక్తులు పాల్గొన్నారు.