మన్యం న్యూస్ గుండాల…ప్రజాపందా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాయకులు వాంకుడోత్ అజయ్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ శాంతయ్య జండా ఎగరవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అనేకమంది కార్మికుల ప్రాణ త్యాగంతోనే మే డే ఆవిర్భవించిందని నాయకులు అన్నారు. 8 గంటల పని దినాలను 12 గంటలకు పెంచి యాజమాన్యాలు శ్రమదోపిడికి పాల్పడుతుందని వారు పేర్కొన్నారు. శ్రమదోపిడికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకరన్న, మంగయ్య, కృష్ణ , రాజు, జగన్, పాపయ్య, తదితరులు పాల్గొన్నారు .
