మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 01: సమస్యల పరిష్కారం కోసం గ్రామ దీపికలు చేపట్టిన నిరసన దీక్ష సోమవారానికి 15వ రోజుకు చేరుకుంది. న్యాయమైన సమస్యలపై పోరాడుతున్న గ్రామ దీపికల సమస్యను కేసీఆర్ స్పందించి పరిష్కరించాలని జనసేన పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ డేగల రామచంద్రరావు డిమాండ్ చేశారు. నిరసన దీక్ష చేస్తున్న 40మంది గ్రామ దీపికలకు అశ్వారావుపేట పాత ఎంపీడీవో కార్యాలయంలో మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా జనసేన కార్యకర్తలు అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దామెర బాబి, రాజా, నాగు, ఇస్లావత్ వినోద్, అడ్డూరి అనిల్, తదితరులు పాల్గొన్నారు.