మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 1
మణుగూరు ప్రభుత్వ ఐటిఐ లో కాంట్రాక్టు ఉద్యోగులుగా గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏటిఓలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెగ్యులరైజ్ చేస్తూ,జీవో జారీ చేసిన సందర్భంగా సోమవారం మణుగూరు ప్రభుత్వ ఐటిఐ లోని ఏటిఓలు సీఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.అదే విధంగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం కృషిచేసిన తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మణుగూరు ప్రభుత్వ ఐటిఐ కాలేజీ ప్రిన్సిపల్,ఏటీవోలు జీవీ కృష్ణారావు,శ్రీనివాసరావు,అంకం నరసయ్య,కాలేజీ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.