UPDATES  

 మేడే పోరాట స్ఫూర్తితో మతోన్మాదం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం సి ఐ టి యు జిల్లా అద్యక్షులు కె.బ్రహ్మాచారి

మన్యం న్యూస్ చర్ల :
మేడే పోరాట స్ఫూర్తితో మతోన్మాదం ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి పేర్కొన్నారు.137 వ మే డే సందర్భంగా చర్ల మండలంలో సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ అనంతరం భారీ ప్రదర్శన, ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్లో సిఐటియు మండల నాయకులు శ్యామల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో బ్రహ్మచారి మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడెల రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గం ఐక్యతకు పోరాటాలకు మేడే మార్గదర్శిగా నిలుస్తుందని పేర్కొన్నారు. బిజెపి విధానాలు కార్మిక వర్గం యొక్క ఐక్యతను విచ్ఛిన్నం చేస్తున్నాయని విమర్శించారు. మేడే చరిత్రను భారతదేశ కార్మికుల పోరాట చరిత్రను బిజెపి వక్రీకరిస్తుందని విమర్శించారు. కార్మికుల పోరాడి సాధించుకున్న హక్కుల మీద దాడి చేయటాన్ని ఖండించారు. పని గంటల పెంపు లేబర్ కోడులు పని కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించకపోవడం తదితర చర్యల ద్వారా పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలకు లాభాలు సమకూర్చి పెట్టే పనిలో కేంద్ర బిజెపి ప్రభుత్వం నిమగ్నమైందని సిఐటియు పేర్కొన్నది. కార్మికులను ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక దోపిడీల నుండి విముక్తి చేయడమే సిఐటియు లక్ష్యమని జిల్లా అధ్యక్షులు బ్రహ్మచారి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వేతనాల పెంపు కోసం ఉద్యోగ భద్రత కోసం 15 రోజులుగా సమ్మె చేస్తున్న ఐకెపి వివో లను ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు ఆటో తదితర అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది మే డే పోరాట స్ఫూర్తితో కార్మిక వర్గం యొక్క సమస్యల పరిష్కారం కోసం సిఐటియు కృషి చేస్తుందని పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో 10 కేంద్రాల్లో నేడే జెండా ఆవిష్కరణ నిర్వహించారు చర్ల బస్టాండ్ సెంటర్ నుండి చర్ల పురవీధుల కింద భారీ ప్రదర్శన నిర్వహించారు ఎర్రజెండా పాటలకు నృత్యాలు చేస్తే కార్మికులు కదం తొక్కారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కారం నరేష్, సిఐటియు మండల కమిటీ సభ్యులు గణేష్, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ బాలాజీ, ఆటో యూనియన్ కార్యదర్శి సంపత్, యూనియన్ అధ్యక్షురాలు ఇరుప అనురాధ, కార్యదర్శి మీనా అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు పాలెం నాగమణి, మిషన్ భగీరథ యూనియన్ భోజన కార్మికులు యూనియన్ నాయకురాలు శ్యామల సమ్మక్క, సిఐటియు నాయకులు విజయలక్ష్మి, మెంబర్స్ నాగ హరి వర్మ,మండల నాయకులు మచ్చ వెంకటేశ్వర్లు, సంజీవ్ పోతురాజు తదితరులు పాల్గొన్నారు .

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !