మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 01: మండల పరిదిలోని పేరాయిగూడెం గ్రామానికి చెందిన జుజ్జారపు శ్రీ రామూర్తి శ్రమ శక్తి అవార్డ్ పొందారు. సత్తుపల్లి లో జెవిఆర్ ఒ.సి ఫిట్ సెక్రటరీ చేస్తున్నందకు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లా రెడ్డి చేతుల మీదుగా శ్రమ శక్తి అవార్డ్ అందుకున్నారు. శ్రమశక్తి అవార్డు అందుకోవడం పట్ల సింగరేణి జిఎం, తోటి సిబ్బంది, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.