మన్యం న్యూస్ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయంలో సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్ లో గిరిజనుల నుంచి వచ్చిన వినతులను స్వయంగా స్వీకరించి సమస్యలను త్వరితగతిన పరిష్కారం చూపాలని సంబంధిత సెక్టార్ అధికారులకు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి అంకిత్ ఐఏఎస్ ఆదేశించినారు.ఈ గిరిజన దర్బార్ లో వివిధ మండలాల నుండి (07) దరఖాస్తులను ప్రాజెక్టు అధికారి స్వయంగా స్వీకరించారు.వెంకటాపురం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన చెరుకుల నాగమ్మ ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో స్వీపర్ పోస్టు ను ఇప్పించుట గూర్చి దరఖాస్తు చేసుకున్నారు.కొత్తగూడెం మండలంలోని మోకాళ్ళపల్లి గ్రామానికి చెందిన పత్తి రమేష్ మంగళ వారం రోజున రాత్రి కురిసిన భారీ వర్షానికి తన పెంకుటిల్లు పూర్తిగా కూలి పోయినదని ఐటీడీఏ ద్వారా ఆర్థిక సాయం అందించాలని దరఖాస్తు ప్రాజెక్టు అధికారికి అందజేశారు.
ఏటూరు నాగారం మండలంలోని చిన్నబోయిన పల్లి గ్రామానికి చెందిన ఎట్టి బాబు ఆర్వో ఎఫ్ ఆర్ హక్కు పత్రం పొంది ఉన్నానని తన పై ఫారెస్ట్ అధికారులు సాగులో ఉన్నటువంటి భూమినితీసుకొని కేసులు పెడతామని ఇబ్బంది పెడుతున్నారని. న్యాయం దరఖాస్తులోకోరారు.మంగపేట మండలం జిపి నరసింహసాగర్ గ్రామం శనిగకుంట గ్రామానికి చెందిన సంధ్య ఇతరులు ఆదివాసి గిరిజనులకు రేషన్ డీలరు స్టోర్ నరసింహ సాగర్ లో ఏర్పాటు చేయుట గురించి
మంగపేట మండలంలోని మల్లూరు శ్రీ హేమచల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలోని వివిధ అభివృద్ధి పనులు చేయుటకు ఐటిడిఏ ద్వారా నిధులు మంజూరు చేయుటకు తోలం నరసింహారావు దరఖాస్తు అందజేశారు.సునీత పి ఈ టి ఆశ్రమ పాఠశాల గర్ల్స్ తాడ్వాయి లో సమ్మర్ గేమ్స్ స్పోర్ట్స్ క్యాంప్ జూలై వాడ లో నిర్వహిస్తున్నారు తన యొక్క విధులు రద్దు చేయుట గురించి విన్నపం,ములుగు మండలం మదనపల్లి గ్రామానికి చెందిన మాలోతు సురేష్ నాకు ఏదైనా గురుకుల జూనియర్ కాలేజీ,ఆశ్రమ పాఠశాల పాఠశాలల్లో ఔట్సోర్సింగ్ లలో నాకు ఉపాధి అవకాశం కల్పించాలని ప్రాజెక్ట్ అధికారికి దరఖాస్తు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏపీవో వసంతరావు,డిప్యూటీ డైరెక్టర్ పోచం,ఏవో దామోదరం స్వామి,ఎస్ఓ రాజ్ కుమార్,పి హెచ్ ఓ రమణ,ప్రాజెక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ భారతి, జిసిసి డి ఎం ప్రతాప్ రెడ్డి,ఆర్ సి ఓ రాజ్యలక్ష్మి,డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ క్రాంతి కుమార్,ఐటీడీఏ మేనేజర్ శ్రీనివాస్,గ్రీవెన్స్ సెల్ లో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.
