మన్యం న్యూస్ చండ్రుగొండ మే 01 : మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా జి రేవతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అన్నపురెడ్డిపల్లి ఎంపీడీవో గా విధులు నిర్వహించి, సాధారణ బదిలీలలో భాగంగా చండ్రుగొండకు బదిలీ అయ్యారు. నూతన మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జి రేవతిని మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ధారా వెంకటేశ్వరరావు( దారా బాబు),సర్పంచ్ కుమారి, బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మేడ మోహన్ రావు, నల్లమోతు వెంకటనారాయణ, వంకాయలపాటి బాబురావు, సత్తి నాగేశ్వరరావు, భూపతి రమేష్, శ్రీను, శ్రావణ్, కలిసి అభినందనలు తెలియజేశారు. అధికారులకు, మండల ప్రజా ప్రతినిధులకు , నాయకులు సహకరించాలని ఆమె కోరారు.