మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి వేదికగా మారిందని..ప్రజావాణిలో వచ్చిన సమస్యలు పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుతెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో కొత్తగూడెంలోని ఐడిఓసికార్యాలయపు సమావేశపు హాలులో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి సమస్యల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ సమస్య పరిష్కారం కోరుతూ అందచేసిన దరఖాస్తును ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేసినట్లుచెప్పారు. దరఖాస్తు ఇచ్చిన ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన తగిన చర్యలు తీసుకోవాలని ఆయాశాఖల అధికారులను ఆదేశించారు.
ప్రజావాణిలో సమస్యను పరిష్కరించాలని ప్రజలు అందచేసిన దరఖాస్తులు కొన్ని:: –
బూర్గంపాడు మండలం, గ్రామానికి చెందిన దుద్దుకూరి ప్రసాద్ దుద్దుకూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి బూర్గంపాడుమండలం, లక్ష్మీపురం గ్రామంలో సర్వే నెం. 455/33, 455/38, 440/1/64లో మొత్తం మూడు ఎకరాలు లేని భూమినితప్పుడు సమాచారంతో పహాణిలోను ధరణిలోను నమోదు చేపించుకున్నారని, విచారణ నిర్వహించి తగు
చర్యలు తీసుకోవాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు కొరకు ధరణి సెక్షన్ తహసిల్దార్కు ఎండార్స్ చేశారు. మణుగూరు మండలం, కొత్త కొండాపురం గ్రామానికి చెందిన కారం సాయికిరణ్ ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లడానికి పరీక్ష వ్రాసి ఉత్తీర్ణత సాధించానని, రెండు సంవత్సరాలకు 25 లక్షలకు పైగా ఖర్చు అవుతున్నదని, సన్నకారు
రైతు కుటుంబానికి చెందిన వాడినని, కావున తనకు విద్యా రుణం మంజూరు చేపించాలని చేసిన ధరఖాస్తునుపరిశీలించిన ఆయన తగు చర్యలు నిమిత్తం జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్కు ఎండార్స్ చేశారు.దుమ్ముగూడెం మండలం, దబ్బనూతల గ్రామానికి చెందిన సొందే తులసమ్మ తాత ముత్తాతల నుంచి దబ్బనూతలగ్రామ పరిధిలోని సర్వే నెం.108/5లోని ప్రభుత్వ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నామని, అట్టి భూమికి రెవిన్యూ
రికార్డులలో తన పేరు నమోదులు చేసి యాజమాన్యపు హక్కులు కల్పించాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన ఆయన
తగు చర్యలు కొరకు కలెక్టరేట్లోని ఈ సెక్షన్ సూపరింటెండెంట్కు ఎండార్స్ చేశారు.
పాల్వంచ మండలం, పాండురంగాపురం గ్రామానికి చెందిన వి స్వాతి భర్త నాగరాజు రేకులషెడ్డులో నివాసంఉంటున్నామని, గృహాలక్ష్మి పథకం క్రింద ఇల్లు మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం రెండుపడక గదుల ఇళ్లు పర్యవేక్షణ అధికారికి ఎండార్స్ చేశారు.టేకులపల్లి మండలం, జేత్యాతండాకు చెందిన బి అశోక్కుమార్ బేతంపూడి గ్రామంలోని సర్వే నెం. 958/11లో
ఉన్న 3.07 ఎకరాల భూమి ఆన్లైన్లో కనిపిస్తున్నదని, కానీ అట్టి భూమికి పట్టాదారు పాసుపుస్తకం రాలేదని, మీ సేవద్వారా ఫిబ్రవరిలో దరఖాస్తు చేసియున్నానని, తనకు పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేపించాలని చేసిన దరఖాస్తును
తగు చర్యలు కొరకు ధరణి పర్యవేక్షకులకు ఎండార్స్ చేశారు.కొత్తగూడెం మున్సిపాల్టీ పరిధిలోని సఫాయిబస్తీకి చెందిన మాతంగి పద్మావతి సఫాయిబస్తీలోని ఇంటి నెంబరు6-12-112లో ఆరు గదుల రేకుల ఇల్లు కలదని, అట్టి ఇల్లు తన భర్త తల్లిపేరున ఉందని, తప్పుడు పత్రాలు సృష్టించి
తన ఇల్లును రాసపల్లి పుష్ప ఆక్రమించుకుని తప్పుడు పత్రాలకు పట్టాలు తీసుకున్నారని, తన భర్తకు సంబంధించిన ఇల్లుకాబట్టి విచారణ నిర్వహించి పట్టాలు రద్దు పరచాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన ఆయన తగు చర్యలు కొరకుకొత్తగూడెం మున్సిపల్ కమిషనర్కు ఎండార్స్ చేశారు.ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.