మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి ఏప్రిల్ 30: ఆర్యవైశ్యుల కులదైవం అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలను ఆదివారం అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.అనంతరం శ్రీ వాసవి అమ్మవారిని కోలాటంతో ఊరేగింపు కార్యక్రమం ప్రదర్శనగా జై వాసవి జై జై వాసవి అంటూ నినాదాలు చేస్తూ కళ్యాణ మండపానికి తీసుకువచ్చి,పూజారులుచే మంత్రోచ్ఛారణల నడుమ గణపతి పూజ వాసవి మాతకు ప్రత్యేక అభిషేకాలు,కుంకుమ పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.అనంతరం వాసవి మాత కరుణాకటాక్షాలతో ప్రజలు సుఖశాంతులతో పాడిపంటలతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకున్నారు.అనంతరం తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ సభ్యులు వనమా గాంధీ,ఉపాధ్యక్షులు దోసపాటి రాంబాబు,జంగాల శ్రీను,కోశాధికారి దారా ప్రదీప్,ఆర్యవైశ్యులు వేముల నగేష్,కంచర్ల శేషు,గోళ్ళ ముత్తయ్య,గోళ్ళ పుల్లారావు,దార ప్రవీణ్,దోసపాటి శంకరరావు,చిట్లూరి రవి,గుండాల సునీల్ ఆచంటి ఆంజనేయ వరప్రసాద్ కొత్తగుండ్ల మహేష్,వేముల రాకేష్,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.