మన్యం న్యూస్ మణుగూరు టౌన్: ఏప్రిల్ 30
సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా ఓసి-2 రిలే సి లో డంపర్ ఆపరేటర్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఎండి జహంగీర్ కు ఈ పీ ఆపరేటర్లు సహోద్యోగులు,అధికారులు బంధుమిత్రులు శాలువా, పూలమాలలు,జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఆదివారం నాడు పీవీ కాలనీ గోల్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన సన్మాన కార్యక్రమానికి ఏరియా కార్మిక సంఘాల నాయకులు రిలే-సి వంద టన్నుల డంపర్ ఆపరేటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పదవీ విరమణ సభలో వారు మాట్లాడారు.మితభాషి,సంస్థ పట్ల అంకితభావం తన 28 సంవత్సరాల సర్వీసులో ఎలాంటి ప్రమాదం లేకుండా రక్షణ తో కూడిన ఉత్పత్తికి పాటుపడ్డారని,ఈ సందర్భంగా జహంగీర్ సేవలను పలువురు కొనియాడారు.నేటి యువ ఆపరేటర్లకు ఆయన స్ఫూర్తి కావాలన్నారు.ఆయన విశ్రాంతి జీవితం ఆనందమయం కావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ ఆపరేటర్ సయ్యద్ నాసర్ పాషా సమన్వయకర్తగా వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు వి.ప్రభాకర్ రావు, మేకల ఈశ్వర్ ఏఐటీయూసీ, రిలే -సి అధికారులు బి బాబ్జి, కృష్ణమూర్తి,నాయకులు కోట శ్రీనివాస్,డి వీరభద్రయ్య,కాపా శివాజీ,చిట్టి వెంకటేశ్వర రెడ్డి, సిహెచ్ అశోక్,జె లక్ష్మీ నారాయణ,ఫంక్షన్ నిర్వహణ కమిటీ సభ్యులు పూజారి అర్జున్ రావు,మిద్దెపాక శ్రీనివాస్,జానకి ప్రసాద్,పదవీ విరమణ చేసిన ఆపరేటర్ కోపరి ప్రసాద్,సూపర్వైజర్లు కోలా వెంకటేశ్వర్లు,కోడి శ్రీనివాస్,సుకుమార్,దేవేష్, కిరణ్ ఆపరేటర్లు,శనిగరపు కుమారస్వామి,బర్ల గోపి,ఐ శంకర్,కే బాబూలాల్,మేకల కేశవ స్వామి,పెద్ద ఎత్తున రిలే – సి ఆపరేటర్లు పాల్గొన్నారు.