మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 30::
తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల రాజాధికారం కోసం ఉద్యమించాలని బిఎస్పి మండల అధ్యక్షుడు కంచర్ల సింహాద్రి కోరారు. మండలంలోని సీతానగరం గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాదు నగరంలో మే 7న జరిగే తెలంగాణ భరోసా సభ వాల్ పోస్టర్లను విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబం దొరల పాలనలో బందీ అయిందని తెలంగాణ రైతులకు నిరుద్యోగులకు నిర్ణయాత్మక రాజ్యాధికారం బిఎస్పి పార్టీతోనే సాధ్యమవుతుందని అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో సాధించుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం మండల కార్యదర్శి రవీంద్ర ప్రసాద్ కునుకు సాగర్ ధనగం వంశీ శివాజీ తదితరులు పాల్గొన్నారు.