మన్యం న్యూస్, పినపాక:
పోలీస్ శాఖ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఆదివాసి గ్రామాలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఏడూళ్ళ బయ్యారం సిఐ రాజగోపాల్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం రాబిన్ హడ్ ఆర్మీ హైదరాబాద్ స్వచ్ఛంద సంస్థ, దాతల సహకారంతో పినపాక మండలంలోని వలస ఆదివాసీ గ్రామం విప్పల గుంపులో పోలీస్ శాఖ సహకారంతో సోలార్ లైట్లు, దోమతెరలు, వాలీబాల్ కిట్లను మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ
కార్యక్రమంలో మణుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు , ఎస్సై నాగులు మీరా ఖాన్ , బోటి గూడెం సర్పంచ్ సోంబయిన సుధాకర్, రాబిడ్ హుడ్ స్వచ్చంద సంస్థ వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.