UPDATES  

 మేడే వర్ధిల్లాలి ప్రపంచ కార్మికులారా ఏకం కండి: ఇఫ్టూ రాష్ట్రనాయకులు షేక్ యాకూబ్ షావలి

 

మన్యం న్యూస్,ఇల్లందు:భారత కార్మిక సంఘాల సమైక్య(ఇఫ్టు) ఆధ్వర్యంలో 138వ మేడే ప్రచారం స్థానిక సింగరేణి జేకే, సివిల్ డిపార్ట్మెంట్ లలో మరియు సోలార్ ప్లాంట్ కార్మికుల మస్టరు అడ్డావద్ద ఆదివారం జరిగింది.ఈ సందర్భంగా మేడే ప్రచారసభలో పాల్గొన్న ఇఫ్టూ రాష్ట్రనాయకులు షేక్ యాకుబ్ షావలి మాట్లాడుతూ… ఎనిమిది గంటల పనిదినం కోసం కార్మికులు పోరాడలని పిలుపునిచ్చారు.
సోలార్ ప్లాంటులో పని చేసే కార్మికులకు సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల మాదిరిగా కనీసవేతనాలు చెల్లించడం లేదని, సోలార్ కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోలార్ కార్మికులకు సెంట్రల్ జీవో అమలు కోసం సింగరేణి ఉన్నత అధికారులను కలసి వినతి పత్రాలు ఇచ్చినా కూడా నేటికి సమస్య పరిష్కారం కాలేదని సింగరేణి అధికారుల ధోరణి ఇకనైనా మారాలని పేర్కొన్నారు.
మేడే స్ఫూర్తితో సోలార్ కార్మికులు కనీస వేతనాల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మికులు బాలు, రామకృష్ణ, చొప్పరి శ్రీను, పంజా శ్రీను, సంజీవ్, లింగమూర్తి, కిరణ్, దుర్గ, లీల బాయ్, కిరణ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !