నూతన జంటను ఆశీర్వదించిన ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:ఇల్లందు పట్టణంలోని స్థానిక అయితా ఫంక్షన్ హాల్ నందు బుధవారం మన్యం పేపర్ ఇల్లందు నియోజకవర్గ ఇంచార్జ్ శశికుమార్ తమ్ముడు సాయికుమార్-స్వప్నల వివాహ వేడుకకు ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, ఇల్లందు పట్టణ ఉపాధ్యక్షుడు ఎస్కే పాషా, ఇల్లందు పట్టణ ప్రచార కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారపు రాజేష్, ఇల్లందు పట్టణ నాయకులు, సోషల్ మీడియా ఇన్చార్జి ఎంటెక్ మహేందర్, యువజన నాయకులు నెమలి నిఖిల్ తదితరులు పాల్గొన్నారు
