మన్యం న్యూస్, పినపాక:
బూర్గంపాడు మండలం మరికుంట గ్రామంకు చెందిన విద్యార్థి బుర్ర రజిత – తండ్రి కృష్ణయ్య, బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్ హాస్టల్లో ఉంటూ గ్రూప్స్ కోచింగ్ తీసుకుంటుంది. ఆర్థిక స్థోమత లేక ఎమ్మెల్యే రేగా కాంతారావు ను కలిసి, పరిస్థితి తెలియజేయగా, స్పందించిన ఎమ్మెల్యే రూ 30 వేల రూపాయలను ఆమె చదువుల నిమిత్తం అందజేశారు. ఈ కార్యక్రమంలో గొందిగూడెం సర్పంచ్ పరిసిక సూరిబాబు, ఎలకలగూడెం సర్పంచ్ కలేటి. నరసింహారావు, పినపాక నియోజకవర్గం యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్, అశ్వాపురం సోషల్ మీడియా ఇన్ఛార్జి నజీర్ సోను తదితరులు పాల్గొన్నారు.