UPDATES  

 సింగరేణి ఉద్యోగుల పిల్లలు వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి -డిజిఎం పర్సనల్ ఎస్ రమేశ్

 

మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 03

సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో మణుగూరు పి వి కాలనీ లోని భద్రాద్రి నందు మే 4 గురువారం సాయంత్రం 5.00 గంటలకు సింగరేణి ఉద్యోగుల పిల్లలు 18 ఏళ్ల లోపు బాల బాలికలకు పలు క్రీడలలో వేసవి శిక్షణ తరగతులు,నిర్వహిస్తున్నామని డీజీఎం ఎస్ రమేష్ తెలిపారు.మే 27వ తేదీ వరకు నిర్వహించబడే ఈ శిక్షణ శిభీరంలో, ఫుట్ బాల్,అథ్లెటిక్స్ వాలిబాల్,కరాటే,బాస్కెట్ బాల్ విభాగాలలో వేసవి శిక్షణ తరగతులు,నిర్వహించబడతాయని వారు తెలిపారు.ఈ శిక్షణ తరగతులను ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది వారు తెలిపారు.కావున సింగరేణి ఉద్యోగుల పిల్లలు, వేసవి క్రీడా శిభిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.సింగరేణి ఉద్యోగులు తమ పిల్లలను అధిక సంఖ్యలో చేర్పించి, శిక్షణ శిబిరాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !