మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిది
జూన్ 1వ తేదీన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు మొదటి దశ తనిఖీలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అనుదీప్ తెలిపారు. బుధవారం ఆర్డిఓ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఈవిఎం గోదాంను ఆయన తనిఖీ చేశారు. గోదాంకు వేసిన తాళం, సిసి కెమెరాలను పరిశీలించారు. గోదాంకు చుట్టూ ప్రహరీ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని చెప్పారు. పటిష్ట నిఘా ఉండాలని సూచించారు. గోదాం తనిఖీ రిజిస్టర్ లో సంతకం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒక సారి ఈవియం గోదాంలో రక్షణ ఏర్పాట్లను తనిఖీ చేసి నివేదిక పంపనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ సురేష్ కుమార్, కొత్తగూడెం తహసీల్దార్ శర్మ, ఎన్నికల విభాగపు సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.