మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 3
మణుగూరు పివి కాలనీ కూనవరం రైల్వే గేట్ నుంచి బొంబాయి కాలనీ మహాత్మ గాంధీ బొమ్మ సెంటర్ వరకు సింగిల్ రోడ్డును వెడల్పు చేసి, మరమ్మత్తులు చేయాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు అని కాలనీ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఎస్డి.నాసర్ పాషా తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,బొంబాయి కాలనీ రోడ్డు,బాగా గుంతల మయంగా మారిందని,రోడ్డు బాగు చేయమని,అడిగిన ప్రతిసారి ప్రజాప్రతినిధులు, ఆర్అండ్ బి అధికారులు రోడ్డు అభివృద్ధి పనులకు నిధులు కూడా మంజూరయ్యాయని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పడమే కానీ,ఇప్పటి వరకు రోడ్డు మాత్రం బాగు చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ రోడ్డులో ప్రయాణించాలంటే ద్విచక్ర వాహనదారులకు చాలా ఇబ్బందిగా తయారైందని అన్నారు.ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు స్పందించి రోడ్డు.మరమ్మతు లతో పాటు తారు కూడా వేయాలని కోరారు.అది కూడా వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు సింగరేణి కార్మికులు మందా అంజయ్య,ఎండి అహ్మద్,పి శ్రీనివాస్,ఈ యాకయ్య,వట్టం శాంతయ్య,గుమ్మడి రాజేష్,కె రవిశంకర్,బి రజనీకాంత్,ఎం రాజశేఖర్,తదితరులు పాల్గొన్నారు.