మన్యం న్యూస్ మణుగూరు మే 3
అశ్వాపురం మండలంలోని పలు శుభకార్యాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతరావుబుధవారం హాజరయ్యారు.ఈ సందర్భంగా మొండికుంట కె.వి.ఆర్ ఫంక్షన్ హాల్ లో తాటిపాముల ఐలయ్య కనిష్ట కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నుతన వధూవరులకు విప్ రేగా ఆశీర్వదించారు. అనంతరం గొల్లగూడెం బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వివాహ వేడుకలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.జగ్గారం గ్రామానికి చెందిన ఎడ్ల బలరాం కుమారులు ఎడ్ల నరేష్ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమం లో అశ్వాపురం మండలం ప్రజాప్రతినిధులు,మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,మండల అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్,ఈదార.సత్యనారాయణ,సూదిరెడ్డి గోపి రెడ్డి,చిలక వెంకటరమయ్య,జగ్గారం సర్పంచ్ సున్నం రాంబాబు, నియోజకవర్గ యువజన విభాగం ఉప అధ్యక్షులు లంకెల రమేష్,మండల యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ,మండల బిఆర్ఎస్ పార్టీ ప్రచారా కార్యదర్శి గడకారి రామకృష్ణ, ఎస్టీ సెల్ అధ్యక్షులు కోర్స దుర్గ రావు,మండల మైనార్టీ అధ్యక్షులు ఎస్.కే నయీమ్, సహాదేవ్,వెంకటేశ్వర్లు,జావీద్,జూపెల్లి కిరణ్,సంపత్,శాంసన్, భాస్కర్,తదితర నాయకులు పాల్గొన్నారు.