మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 03
మణుగూరు మండల పరిధి లోని గిరిజన భవన్ లో మే 4వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు పినపాక నియోజకవర్గ స్థాయి బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అని,మణుగూరు పట్టణ యువజన ప్రధాన కార్యదర్శి గుర్రం సృజన్ తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు హాజరవుతున్నారు అని వారు తెలిపారు.కావున మణుగూరు పట్టణం లోని అన్ని వార్డుల లోని యువజన నాయకులు, యూత్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని వారు కోరారు.