కిన్నెరసాని నీళ్ళు రాక ప్రజలు అనేక ఇబ్బందులు: సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య
అధికారులకు పట్టని ప్రజల ఇబ్బందులు:పట్టణ అధ్యక్షులు బొమ్మిడి మల్లికార్జున్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
కొత్తగూడెం పట్టణ ప్రజలకు తాగునీరు అందించడంలో అధికారులు ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని వారానికి ఒకసారి కిన్నెరసాని తాగునీరు సరఫరావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎందుకు పట్టించుకోవడం లేదని సీనియర్ నాయకుడు రాయల శాంతయ్య పట్టణ అధ్యక్షులు బొమ్మిడి మల్లికార్జున్ విమర్శించారు బుధవారం స్థానిక బస్టాండ్ సెంటర్ లో గల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కొత్తగూడెం నియోజకవర్గం లో కిన్నేరసాని నీళ్ళు రాక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అసలే ఎండకాలం నీళ్ళ రాకపోతే ప్రజలు ఎలా బ్రతుకుతారని ఇంత జరుగుతున్న కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. దానికి తోడు అధికారపార్టీ ఏంఎల్ఏ పట్టించుకోక పోవడం సిగ్గుమాలిన చర్యఅని ప్రజల ఇబ్బందులు పట్టించుకోని ప్రతి నిధులు ఉండటం కంటే రాజీనామా చేయడం ఉత్తమం అన్నారు. ఈ ఎండాకాలంలో ప్రజలకు నీళ్ళు రాకపోతే వారి నీళ్ళ కష్టాలు తీర్చేందుకు అధికారులు ట్యాంకర్ల సదుపాయం కల్పించాలని చిన్న పిల్లలు దాహం తో విలవిల పడుతున్నారని ముందుగా ప్రజల ఇబ్బందుల పడుతున్న నీళ్ళ బాధలు అధికారులు తీర్చాలని తెలిపారు
ఈ కార్యక్రమములో:చుంచుపల్లి మండల అధ్యక్షులు అంతోటి పాల్,బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు,నియోజకవర్గ లీగల్ సెల్ నాయకులు అరలక కర్ణకర్,లక్ష్మీదేవిపల్లి యస్సీ సెల్ అధ్యక్షులు కొప్పుల రమేష్,కాంగ్రెస్ నాయకులు వెలెటీ వెంకటేశ్వర్లు,శనగ లక్ష్మణ్,భూక్యా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు