UPDATES  

 వీధి కుక్కలు కోతులతో రామవరం ప్రజలు భయాందోళన

వీధి కుక్కలు కోతులతో రామవరం ప్రజలు భయాందోళన
కుక్కలు ప్రజలపై దాడి చేస్తున్న పట్టించుకోని అధికారులు
మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం

ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

జిల్లా కేంద్రంమైన కొత్తగూడెం రామవరం లో వీధి కుక్కలు కోతులు స్వైర విహారం చేస్తున్న ప్రజలపై దాడి చేస్తున్న అధికారులు కాలయాపన చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా
విమర్శించారు. ఆయన మాట్లాడుతూ రామవరం లో కుక్కలు కోతులు విపరీతంగా పెరిగి ప్రజలు బయటికి రావాలంటేనే భయాందోళన చెందుతున్నారని వేసవికాలం సెలవుల్లో పిల్లలు బయటికి రావాలంటే భయపడుతున్నారని ఆడుకోవడానికి పిల్లలు బయటికి వెళితే ఏం జరుగుతుందో ఏమో అని తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి రామవరం ప్రాంతంలో ఏర్పడిందని ముఖ్యంగా ఆరో వార్డులో పదుల సంఖ్యలో కుక్కలు గుంపులుగా ఉండి చిన్నపిల్లలు వృద్ధులపై దాడి చేస్తున్నాయని మజీద్ లు, టెంపుల్లో, చర్చలకు ప్రార్థన సమయంలో వెళ్లాలంటే గుంపులు గుంపులుగా కుక్కలు దాడి చేస్తున్నాయని ఎటువంటి ప్రాణహాని జరగక ముందే కుక్కలను పట్టుకొని కోతుల సమస్య పరిష్కరించాలని ఆయన కోరారు అనంతరం కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ కు మెమోరండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖయ్యూం రసూల్ రాహుల్ రణధీర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !