ఘనంగా కొర్రాజుల స్వామి జాతర -ఆకర్శనంగా నిలిచినా సరువులు కార్యక్రమం స్వామి వారిని దర్శించుకున్నా ఎమ్మెల్యే మెచ్చా మన్యం న్యూస్, దమ్మపేట, మే, 04: మండల పరిదిలోని లచ్చాపురం గిరిజన గ్రామంలో ఆదివాసీ నాయకపోడ్లు నిర్వహించి శ్రీ శ్రీ శ్రీ చిన్న కొర్రాజుల స్వామి జాతర గత 4 రోజులుగు వైభవంగ జరిగింది. స్వామి వారి జాతర ఆదివారం ప్రారంబం కాగా ప్రతి రోజు స్వామి వారికీ ప్రత్యేక పూజలు, సేవ కార్యక్రమాలు నాయకపోడు గిరిజనలు నిర్వహించారు. స్థానిక నాయకులుతో కలిసి అశ్వారావుపేట నియోజక వర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు స్వామి వారిని దర్శించు కున్నారు. గురువారం సరువులు కార్యక్రమం ఆకర్షణగా నిలిచింది గ్రామ పొలిమేరలు ఉంచిన మూడు సరువులు (సండ్ర చెట్లు) మంగళ వాయిధ్యాలు, డోలు చప్పుళ్లు, సన్నాయి సంగీతాలతో ఘనచారులు, కుర్రకారు నృత్యాలతో గిరిజన సంప్రదాయం ప్రకారం గ్రామంలో ఊరేగింపు ముగించుకొని స్వామి వారి దేవాలయం చుట్టూ 3 ప్రదక్షణలు చేసి ఆలయం వద్ద పెట్టారు. అనంతరం డోలు చప్పుళ్లకు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమం చూడటానికి చుట్టుప్రక్కల పలు గ్రామాల ప్రజలు, గిరిజన భక్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
