UPDATES  

 ముస్లిం మైనార్టీ సంక్షేమ సమితి సమావేశం • హాజరైన రాష్ట్ర అధ్యక్షులు ఎండి యాకూబ్ పాషా.

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండల అధ్యక్షులు ఎండి ఖయ్యూం ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల సంక్షేమ సమితి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఎండి యాకూబ్ పాషా హాజరు అయినారు. ముస్లిం మైనార్టీల సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎండి యాకూబ్ పాషా మాట్లాడుతూ… ముస్లిం మైనార్టీ సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మైమూద్ ఖాన్ ఆదేశాల మేరకు ఈ సభకు హాజరు కావడం జరిగిందని, ప్రస్తుతం కొన్ని అనివార్య కారణాలవల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష పదవి తొలగించడం జరిగిదని జిల్లా అధ్యక్షుడు లేనందున జిల్లా అధ్యక్షుడిని నియమించే వరకు జిల్లా ఇన్చార్జిగా వ్యవహరించలని వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ ఖాన్ తెలిపారని, జిల్లా మొత్తం విస్తృత పర్యటన చేసి త్వరలోనే అర్హులైన వారికి జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తాము అన్నారు. అదే కాకుండా మండలం, టౌన్ కమిటీలను నియమిస్తాం ప్రస్తుతం ఉన్న జిల్లా కమిటీ మండల అధ్యక్షుడు పట్టణ అధ్యక్షులు కమిటీ వారు బలోపేతం చేయాలని సూచించినారు. ఈ సమావేశానికి భద్రాద్రి కొత్తగూడెం ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్, కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ ఎండి హబీబ్, చుంచుపల్లి మండల అధ్యక్షులు ఎండి ఖయ్యూం, చుంచుపల్లి మండల జనరల్ సెక్రటరీ షేక్ జైనుల్లా, అదేవిధంగా జాయింట్ సెక్రెటరీ షేక్ అన్వర్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !