మన్యంన్యూస్ ఇల్లందురూరల్:- ఇల్లందు మండల పరిధిలోని ఇందిరానగర్ పంచాయితీ లోని ప్రైమరీ స్కూల్ నందు కంటివెలుగు కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ పాయం లలిత ప్రారంభించి మాట్లాడుతూ, ఇందిరానగర్ పంచాయితీ ప్రజలు కంటీవెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్స్ కవిత, అనితాదేవి, చంద్రకళ, కృష్ణంరాజు, జయ, సంగీత, సరితా, ఆశా వర్కర్లు భారతి ,పార్వతి తదితరులు పాల్గొన్నారు.
