మన్యం న్యూస్ గుండాల: మా సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ను మణుగూరులో కలిసి మెమొరండం సమర్పించారు. అనంతరం జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం కార్యదర్శి బండారు నరేష్ మాట్లాడుతూ గత వారం రోజుల నుండి జిల్లా కలెక్టరేట్ వద్ద నిరవదిక సమ్మె చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ విప్ రేగాను కలిసి సమస్యలను వారికి విన్నవించుకున్నామని అన్నారు. మా సమస్యలను ఓపికతో విన్న రేగా కాంతారావు ముఖ్యమంత్రి గారి దృష్టికి మీ సమస్యలను తీసుకెళ్తానని వరాహ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు సతీష్ కుమార్, సంపత్, శ్రీనివాస్, విజయ్, తరుణ్, రవికుమార్, సాయి కృష్ణ , రామకృష్ణ , పూజ, వేణు ప్రియా, రజిని, శ్రీను తదితరులు పాల్గొన్నారు .
