UPDATES  

 పాఠాలు చెప్పే పంతులు పిచ్చి చేష్టలు

  • పాఠాలు చెప్పే పంతులు పిచ్చి చేష్టలు
  • శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు వేధింపులు
  • ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
  • పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు
  • పరారీలో ఉపాధ్యాయుడు
  • పూర్తి బాధ్యత పాఠశాల యాజమాన్యమే వహించాలని ఆందోళన
  • డొనేషన్లు, ఫీజులు పై ఉన్న శ్రద్ధ విద్యార్థుల భద్రతపై
  • చూపరా అంటు ఆగ్రహం
  • పాఠశాల లైసెన్సు రద్దు చేయాలి పలు సంఘాల డిమాండ్

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

సభ్య సమాజం తలదించుకునే విధంగా పాఠాలు చెప్పే పంతులు పిచ్చి చేష్టలు చేయడంతో ఓ విద్యార్థిని మానసికంగా కృంగిపోయి చేసేదేమీ లేక చివరకు పంతులు పెట్టే వేధింపులను తట్టుకోలేక తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో ఆ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పంతులు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చుంచుపల్లి మండలంలోని విద్యానగర్ కాలనీ పరిధిలో గల శ్రీ చైతన్య టెక్నో ప్రైవేట్ పాఠశాలలో 6 తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు గత కొంతకాలంగా వేదిస్తు సెల్ ఫోన్ లో అసభ్యకరమైన మెసేజ్లు పెడుతూ, వేధిస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నటువంటి శ్రీ చైతన్య టెక్నో ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న అభం శుభం తెలియని విద్యార్థినిని అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఓ కీచక ఉపాధ్యాయుడు పాఠాలు నేర్పించడం మాని కామంతో కళ్లు మూసుకు పోయి తనను పాఠశాలలో సార్ అని పిలవవద్దని, బావ అని పిలవాలని కొంతకాలంగా ఆ విద్యార్థినిని వేధిస్తుండటంతో తన పట్ల మాస్టారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో తెలియక మొత్తం విషయాన్నీ విద్యార్థిని తల్లిదండ్రులతో చెప్పటంతో షాక్ తిన్న ఆమె తల్లిదండ్రులు వెంటనే తమ గ్రామంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఉపాధ్యాయుడు పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఉపాధ్యాయుడు పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య పాఠశాలకు ఉన్న పేరు ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. ఆ పేరుతో గల్లీ గల్లికి ఓ పాఠశాల నెలకొల్పుతూ శ్రీ చైతన్య పాఠశాల పేరిట విద్యావ్యాపారం చేస్తున్నారు. కొత్తగూడెం శ్రీ చైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యం భారీగా డొనేషన్లు, ఫీజులు, వసూలు చేయడమే కాకుండా, విద్యార్థుల భద్రతపై శ్రద్ధ చూపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని తల్లిదండ్రులు రాబోయే కాలంలో తమ బిడ్డల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. పిల్లల భద్రత పట్టకుండా కేవలం తక్కువ జీతానికి పనిచేసే వారిని టీచర్ లుగా నియమించుకుంటూ కనీసం వారి వ్యక్తిత్వాన్ని కూడ పట్టించుకోని పాఠశాల లైసెన్సు రద్దు చేయడంతో పాటు, ఇలాంటి ఉపాధ్యాయుడికి తగిన బుద్ధి చెప్పాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు, మహిళా సంఘాలు, రాజకీయ నాయకులు, కోరుకుంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !