వివాహ వేడుకకు హాజరైన ప్రభుత్వ విప్ మన్యం న్యూస్, పినపాక: పినపాక మండలం ఈ. బయ్యారం క్రాస్ రోడ్ లోని జివిఆర్ ఫంక్షన్ హాల్ లో మల్లారం గ్రామపంచాయతీ సర్పంచ్ కొమరం రాధాబాయి , నారాయణ దంపతుల కుమారుడు ప్రవీణ్ కుమార్- సమత ల వివాహ వేడుకకు తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, మండల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
